కాలనీలలో  సమస్యలు పరిష్కరించాలని శంభీపుర్ క్రిష్ణ కు వినతిపత్రం అందజేత

కాలనీలలో  సమస్యలు పరిష్కరించాలని శంభీపుర్ క్రిష్ణ కు వినతిపత్రం అందజేత….

మేడ్చల్, అక్షిత బ్యూరో:

 దుందిగల్  పురపాలక శంభీపుర్ లోని కార్యాలయంలో మంగళవారం  మల్లంపేట 26వ వార్డు కేవిఅర్ కాలనీ సభ్యులు కుత్బుల్లాపూర్ నియోజవర్గ బీఅర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపుర్ క్రిష్ణ ని  మర్యాదపూర్వకంగా కలిసి కాలనీలో నెలోకొన్న డ్రైనేజీ, రోడ్డు  మంచినీటి సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు.. ఈ సందర్భంగా క్రిష్ణ మాట్లాడుతూ వార్డులో మౌలిక సదుపాయాల ఏర్పాటు చేయడమే ధ్యేయం అని తెలిపారు. రాబోయే వేసవిని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికీ డ్రైనేజీ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వాటిని శాశ్వతంగా పరిష్కరించడానికి నూతన ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని తెలిపారు.. ఈ కార్యక్రమంలో కాలనీ సభ్యులు రానజోగ రావు సుజాత  సందీప్ రెడ్డి కార్తిక్ వినోద్  షరీఫ్ సాయి తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking