తెలంగాణ ఉద్యమ నేత వనిగండ్ల నర్సింహారావు కి ఉద్యమ జోహార్
-తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక
ఖమ్మం అక్షిత బ్యూరో :
సమైక్య పాలకుల దోపిడీ విధానాలు ఎండగడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కై 1969 ఉద్యమ సమయంలో ఖమ్మం జిల్లా కొత్తగూడెం ఏపీఎస్ఆర్టీసీ లో ఉద్యోగం చేస్తూనే తెలంగాణ తొలి దశ ఉద్యమం లో వెనిగండ్ల నర్సింహా రావు
కీలక పాత్ర వహించారు.నాటి నుండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయ్యే వరుకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు జరిగిన అనేక ప్రజా ఉద్యమలలో ఖమ్మం జిల్లా లో కీలక పాత్ర పోషించారు. సోమవారం రాత్రి ఖమ్మం రూరల్ మండలం పెద్ద తండ వద్ద గల మనుమడు తెలంగాణ ఉద్యమ నాయకులు పొనుగోటి సంపత్ స్వగృహం లో తుది శ్వాస విడిచారు. వారికీ తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక రాష్ట్ర కమిటీ ఉద్యమ జోహార్లు అర్పిస్తూ వారి భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించటం జరిగింది. వెనిగండ్ల నర్సింహా రావు కుమారుడు, మలి దశ తెలంగాణ ఉద్యమం లో కీలక పాత్ర పోషించిన తెలంగాణ విఠల్ కి మరియు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ని తెలిపారు.ఈ కార్యక్రమం లో తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు బత్తుల సోమన్న రాష్ట్ర మీడియా ఇంచార్జి అనంతుల మధు ఖమ్మం జిల్లా అధ్యక్షులు మాదాసు శ్రీనివాస్ రావు ఖమ్మం జిల్లా బీ సీ జేఏసీ జిల్లా చైర్మన్ పాల్వంచ రామారావు ఉద్యమకారుల ఐక్య వేదిక జిల్లా నాయకులు రామాంజనేయులు శేఖర్ రాజేష్, బిక్షము అశోక్ సింగ్ ఆఫ్జాల్ తదితరులు పాల్గొన్నారు.