
ఉచిత ఎమ్మెన్నార్ స్టడీ మెటీరియల్ను విద్యార్థిని విద్యార్థులకు అందజేసిన కె.వి.ఆర్
రంగారెడ్డి అక్షిత ప్రతినిధి: ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని బొంగ్లూర్ టీఎస్ మోడల్ స్కూల్ విద్యార్థిని,విద్యార్థులకు ఉచిత ఎమ్మెన్నార్ స్టడీ మెటీరియల్ ను అందజేసిన తెలంగాణ స్టార్ కాంపెనీయర్,భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేతుల మీదుగా అందజేయడం జరిగింది .ఇంతటి మహోత్తరమైన కార్యాన్ని నిర్వర్తించిన,సరస్వతీ పుత్రులు, విద్యావంతులు మంచాల జడ్పీటీసీ సభ్యులు, టీపీసీసీ సభ్యులు మర్రి.నిత్య నిరంజన్ రెడ్డి దంపతులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.భవిష్యత్ లో మీరు ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఆశిస్తున్నా ,గ్రామాలలో వున్న పేద విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు అందించి వారి బంగారు భవిష్యత్ కై పూల బాటలు వేస్తున్నారని,మట్టిలో మాణిక్యాలు మీరే అని,నేటి బాలలే రేపటి పౌరులని కృషి పట్టుదలతో చదివి పదవతరగతిలో 10 పాయింట్లు సాధించి,మీ తల్లిదండ్రులకు గొప్ప పేరు తేవాలని,మా ఆశీస్సులు ఎల్లవేళలు మీపై వుంటాయని హితవు పలికారు.ఈ సందర్భంగా స్కూల్ లో వంటగది నిర్మాణానికి ఎంపీ కోమటిరెడ్డి 50,000/- వేల రూపాయలు ఇవ్వడం జరిగింది..ఈ కార్యక్రమంలో ఎమ్మెన్నార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మర్రి నిరంజన్ రెడ్డి ,మంచాల జడ్పీటీసీ మర్రి నిత్య, ప్రిన్సిపల్ లావణ్య , ఆదిభట్ల మున్సిపాలిటీ చైర్మన్ కొత్త ఆర్థిక, ఇబ్రహీంపట్నం జడ్పిటిసి భూపతి గల్లా మహిపాల్ ,కమలాకర్ రెడ్డి,జడ్పీటీసిలు,కౌన్సిలర్లు,స్థానిక నాయకులు పాల్గొన్నారు.