కొనసాగుతున్న గడపగడపకు కాంగ్రెస్

మందమర్రి, అక్షిత ప్రతినిధి:-

భారత్ జోడో యాత్రకు అనుసంధానంగా మందమర్రి పట్టణ కేంద్రంలో గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమం కొనసాగుతుంది. మంగళవారం మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డులోని ఎస్సీ, ఎస్టీ కాలనీ, విద్యానగర్ లో కాంగ్రెస్ పార్టీ చెన్నూరు నియోజకవర్గ అభ్యర్థి, పిసిసి సభ్యుడు, స్థానిక నాయకుడు నూకల రమేష్ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా నూకల రమేష్, పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిన్నింటి రఘునాథ్ లు మాట్లాడుతూ, చెన్నూరు నియోజకవర్గానికి స్థానిక నేతలు ఎమ్మెల్యేలుగా లేనందున ప్రజలకు అందుబాటులో ఉండకుండా, ఇక్కడి వనరులు దోచుకుంటున్నారని ఆరోపించారు. స్థానిక ప్రజలకు ఉండడానికి ఇల్లు లేవని, పట్టణంలో రోడ్లు, డ్రైనేజీలు సరిగా లేవని, ప్రజలకు నెల రోజులకు పైగా త్రాగు నీరు రాకపోయినా పట్టించుకొనే నాథుడే కరువయ్యాడని ఆరోపించారు. ఈ సందర్భంగా 19వ వార్డులో ప్రతి ఇంటికి తిరిగి, ప్రజల ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మందమర్రి పట్టణ అధ్యక్షుడు నోముల ఉపేందర్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోపతి రాజయ్య, సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి ఎండీ ముజాహిద్, పిసిసి ప్రధాన కార్యదర్శి రాఘునాథ రెడ్డి, నాయకులు పుల్లూరి లక్ష్మణ్, ఏటూరి సత్యనారాయణ, నేరువట్ల శ్రీనివాస్, గడ్డం రజనీ, రామకృష్ణాపూర్ పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు, నాయకులు ఎండీ సుకూర్, పిట్టల కిషోర్, వడ్లూరి సునీల్ కుమార్, శ్రీకాంత్, రవి, పోతరవేని వినయ్ కృష్ణ, బుర్ర ఆంజనేయులు గౌడ్, బోయినపల్లి రమేష్, మహిళ నాయకురాలు నూగురి రాధ, దాసరి స్రవంతి, స్వరూప, సునీత తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking