పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
నాంపల్లి, అక్షిత న్యూస్:
నాంపల్లి మండలంలొ లింగోటం గ్రామంలో 40 లక్షల, వడ్డేపల్లి గ్రామంలో 40 లక్షల, నెమల్లగూడం గ్రామంలో 40 లక్షల, దామెర గ్రామంలో 55 లక్షల, నేరళ్లపల్లి గ్రామంలో 40 లక్షల, నర్సింహులగూడం గ్రామంలో 40 లక్షల, అలాగే 8 లక్షల విలువగల అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించారు, జాన్ తాండ గ్రామంలో 30 లక్షల, అలాగే 20 లక్షల విలువ గల గ్రామపంచాయతీ భావననానికి శంకుస్థాపన, రాందాస్ తాండ గ్రామంలో 30 లక్షల, పెద్దాపురం గ్రామంలో 50 లక్షల, నాంపల్లి పట్టణంలో ఒక కోటి రూపాయల సీసీ రోడ్డు డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసారు. నాంపల్లి హాస్పిటల్ లొ 3 లక్షలవిలువ గల నీటి సంపుకు శకుస్థాపన చేసారు, అలాగే మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా 64 లక్షలతో నాంపల్లి హై స్కూల్ కు మౌలిక వసతులకు కొరకు శకుస్థాపన చేసారు, ఆర్ అండ్ బి రోడ్ నుండి జాన్ తాండ వరకు కోటి 25 లక్షల బీటీ రోడ్డుపనులకు శంకుస్థాపన చేసారు అలాగే గ్రామాలలో బిఆర్ఎస్ జెండాలను ఎగుర వేశారుఅలాగే నాంపల్లిలొ కంటి వెలుగుకార్యక్రమంలో పాల్గొన్నారు.సీఎం కెసిఆర్ దీవెనలతో త్వరలో నియోజకవర్గనికి కావలసిన కొత్త బీటీ రోడ్లు మరియు డబల్ రోడ్లు సాంక్షన్ అవుతున్నాయని తెలియచేసారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.