మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆ మహానీయునికి ఘన నివాళులర్పించిన రాష్ట్ర పిసిసి కార్యదర్శి చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి.
మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆ మహానీయునికి ఘన నివాళులర్పించిన రాష్ట్ర పిసిసి కార్యదర్శి చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి.
కోదాడ టౌన్ ,అక్షిత న్యూస్:
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక రంగా థియేటర్ చౌరస్తాలో ఏర్పాటుచేసిన జ్యోతిరావు పూలే జయంతి వేడుకలలో పిసిసి రాష్ట్ర కార్యదర్శి చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి పాల్గొని,
ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ , అసమానతలపై పోరాడిన ఆదర్శమూర్తి,అణగారిన వర్గాల అభ్యున్నతి,వారి విద్యాభివృద్ది కోసం కృషి చేసిన గొప్పమానవతావాది,అభ్యుదయవాది,మనిషిని మహోన్నతుడిగా తీర్చిదిద్దేది విద్య ఒక్కటే అని నమ్మి అందరికీ విధ్యనందించేలా తన భార్య సావిత్రి భాయి పూలేతో కలిసి కృషి చేసిన మహనీయుడు, తత్వవేత్త,,మహాత్మా జ్యోతిబాపూలే అని సామాజిక సంస్కరణ ఉద్యమంలో ప్రసిద్ధుడిగా దేశంలో మహిళా విద్యకు మార్గదర్శకులుగా నిలిచి మహిళ అభివృద్ధి చెందితేనే సమాజం అభివృద్ధి చెందుతుందని విశ్వసించి.వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సామాజికాభివృద్ధికి పాటుపడాలని లక్ష్మీనారాయణ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వంగవీటి రామారావు, మాజీ సర్పంచ్ పార సీతయ్య, పాలూరి సత్యనారాయణ ,ఆవు దొడ్డి ధనమూర్తి, ఎస్.కె బాగ్దాద్, కౌన్సిలర్ కందుల కోటేశ్వరరావు, గంధం యాదగిరి ,బాల్ రెడ్డి ,బైజాన్, గరిని శ్రీధర్ ,కాంపాటి శ్రీనివాస్ ,కాజా గౌడ్ , సైదిబాబు, మాతంగి బసవయ్య ,పాశం శ్రీను, కర్రీ సుబ్బారావు ,రజనీకాంత్ ,అలీ, దాదావలి, తదితరులు పాల్గొన్నారు