సామాన్యులకు చేరువలో మలబార్ గోల్డ్

సామాన్యులకు చేరువలో మలబార్ గోల్డ్

ఆభరణాల కొనుగోలుకై నగరాలకు వెళ్లాల్సిన పనిలేదు

ప్రపంచ స్థాయి భరణాల అనుభూతి మిర్యాలగూడలో 

ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

మలబార్ గోల్డ్, డైమండ్ సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా క్రయవిక్రయాలు జరగాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి బిఎల్ఆర్ కోరారు.

గురువారం మిర్యాలగూడ పట్టణంలో మలబార్ గోల్డ్ డైమండ్ షోరూంను ఎమ్మెల్యే సతీమణి బత్తుల మాధవి ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ మిర్యాలగూడ ప్రజలు వ్యయ ప్రయాసలకోర్చి నగరాలకు వెళ్లి అభరణాలు కొనుగోలు వెళ్ళే అవకాశం లేకుండా మిర్యాలగూడలో ఏర్పాటు చేయడం సంతోషదాయకమన్నారు.

తెలంగాణలో 21వ షో రూమని మలబార్ గ్రూపు చైర్మన్ ఎంపి అహ్మద్ అన్నారు. ప్రపంచ స్థాయి షాపింగ్ అత్యద్భుత ఆభరణాల సేకరణ, ప్రపంచ స్థాయి అనుభూతిని అందిస్తున్నామమ్మారు. అత్యుత్తమ డిజైన్లతో, హస్త కళా ప్రావీన్యంతో తయారు చేసిన ఆభరణాలు అందుబాటులో ఉన్నాయన్నారు.

షో రూంలో మైన్ బ్రాండ్ జ్యువలరీ, ఎరా అన్కట్ జ్యువలరీ, డివైన్ జ్యువలరీ, వివాహ ఆభరణాలు అందుబాటులో ఉన్నాయన్నాయని ఆయన అన్నారు. 13 దేశాల్లో నెట్వర్క్ కలిగి ఉన్నదన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking