ఓటేసిన కలెక్టర్ హరి చందన 

పోలింగ్ ప్రశాంతం

ఓటేసిన కలెక్టర్ హరి చందన 

నల్గొండ, అక్షిత ప్రతినిధి :

నల్గొండ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్
ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు నల్గొండ జిల్లా కలెక్టర్ ,జిల్లా ఎన్నికల అధికారి, నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన తెలిపారు.

సోమవారం పార్లమెంటు ఎన్నికల పోలింగ్ ప్రారంభమైన వెంటనే ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలోని 69 వ పోలింగ్ కేంద్రం (చెన్నకేశవ మెమోరియల్ స్కూల్) లో క్యూ లైన్ లో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అనంతరం జిల్లా కలెక్టర్ పట్టణంలోని సైంట్ ఆల్ఫాన్సీస్ పాఠశాల, జిల్లా విద్యాశిక్షణ సంస్థలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి ఓటర్లతో ముఖాముఖి మాట్లాడారు. ఓటు వేసేందుకు ఓటర్లు తీసుకువచ్చిన గుర్తింపు కార్డులను ,వీల్ చైర్లు, షామియానా, మెడికల్ కిట్లు,ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు,తదితర సౌకర్యాలను,ఇతర ఏర్పాట్లను పరిశీలించారు.

మధ్యాహ్నం 1:00 గంట వరకు నల్గొండ పార్లమెంట్ పరిధిలో 48.48% పోలింగ్ నమోదైనట్లు కలెక్టర్ వెల్లడించారు .పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగడంలేదని, ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతున్నదని తెలిపారు. పోలింగ్ లో మహిళలు, ట్రాన్స్ జెండర్లు, యువత పెద్ద ఎత్తున పాల్గొని ఓట్లు వేస్తున్నారని, ఇది శుభ పరిణామం అని ,ఈ విడత ఎన్నికలలో పోలింగ్ శాతం గతంతో పోలిస్తే పెరిగేందుకు అవకాశం ఉందని ఆమె ఆశ భావం వ్యక్తం చేశారు. జిల్లాలో 61 వేల మంది యువత నూతనంగా ఓటర్లుగా నమోదు చేసుకున్నారని, వీరందరు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనేక ఓటరు చైతన్య కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగానే అన్ని నియోజకవర్గాలలో మోడల్ పోలింగ్ కేంద్రాలతో పాటు, ఉమెన్ మేనేజెడ్ పోలింగ్ కేంద్రాలు, దివ్యంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, ప్రత్యేకించి మహిళలు యువతను ఆకట్టుకునే విధంగా సాంప్రదాయ పద్ధతిలో మోడల్ పోలింగ్ కేంద్రాలను పెళ్లిళ్లకు అలంకరించే విధంగా పందిళ్లతో కొబ్బరి ఆకులు ,మామిడి తోరణాలతో ప్రకృతి సిద్ధంగా రూపొందించామని తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాలలో నీడ కోసం టెంట్లు, తాగునీరు, టాయిలెట్లు, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు, మెడికల్ కిట్లు ,ఆశ, అంగన్వాడి కార్యకర్తస్లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మధ్యాహ్నం వరకు జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసులేదని, ఎక్కడైనా ఈవీఎంలు మొరాయించినట్లయితే తమ దృష్టికి వస్తే తక్షణమే కొత్తవాటిని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు ఎన్నికల పోలింగ్ ను వెబ్ క్యాస్టింగ్ ద్వారా పర్యవేక్షించడం జరుగుతున్నదని, దీంతోపాటు అన్ని నియోజకవర్గాలతో సహాయ రిటర్నింగ్ అధికారులు, జిల్లా స్థాయి అధికారులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.అలాగే ఎఫ్ ఎస్ టి ,ఎస్ ఎస్ టి బృందాలు, మైక్రో అబ్జర్వర్లు, సెక్టోరల్ అధికారులు, జిల్లా అధికారులతో పోలింగ్ ను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.

కాగా నల్గొండ జిల్లా కేంద్రంలో 69వ పోలింగ్ కేంద్రాన్ని వేణు మోడల్ పోలింగ్ కేంద్రంగా ఏర్పాటు చేయగా కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులు సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్ మాణిక్ రావు సూర్య వంశీ పరిశీలించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking