జూన్ 8 వరకు ప్రజావాణి లేదు
పోలింగ్ ముగిసినా… అమలులో నియమావళి
నల్గొండ, అక్షిత ప్రతినిధి :
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసినప్పటికీ జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున జూన్ 8 వరకు ప్రజావాణి కార్యక్రమం ఉండదని జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన ఒక ప్రకటనలో తెలిపారు.
పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు, అలాగే వరంగల్- ఖమ్మం -నల్గొండ పట్టభద్రుల శాసనమండలి ఉప ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ వంటి కారణాలవల్ల కేంద్ర ఎన్నికల సంఘం జూన్ 8 వరకు నల్గొండ జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని విధించినందున జూన్ 8 వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం లేదని ఆమె స్పష్టం చేశారు. అందువల్ల జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించి ప్రతి సోమవారం ఫిర్యాదులు సమర్పించేందుకు నల్గొండ జిల్లా కేంద్రానికి రావద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.