చెర్వు మట్టి అక్రమ దందా

చెర్వు మట్టి అక్రమ దందా

చెరువులు ఎండడంతో
అక్రమ మొరం దందా !

– అటువైపు కన్నెత్తి చూడని అధికారులు

– డబ్బులు వసూలు చేస్తున్న వీడిసిలు

– మొరం తీయడంతో పాతాళానికి భూగర్భ జలాలు

– సాగు త్రాగునీటికి కటకటాలు పడవల్సిందే

ఆర్మూర్, అక్షిత ప్రతినిధి :

ఆలూరు మండలం దేగాం, మచ్చర్ల, పలు గ్రామాలలో చెరువుల నుండి మొరం మట్టి తీస్తున్నారు. ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా రైతుల పేరు చెప్పి వీడీసీలు డబ్బులు వసూలు చేస్తూ వందల ట్రాక్టర్లతో చెరువుల నుండి మొరంను మట్టిని తోలిస్తున్నారు. వేసవి కాలం అవ్వడంతో చెరువులు పూర్తిగా ఎండిపోయే స్థితికి చేరాయి. అయితే అదే అదునుగా భావించిన గ్రామాలలోని వీడీసీలు చెరువులోని మట్టిని మొరం ను అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వానికి ఎలాంటి రుసుము చెల్లించకుండా అటు రెవెన్యూ అధికారుల నుండి “ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా మొరం తోడేస్తున్నారు. వందల ట్రాక్టర్లు పదుల సంఖ్యలో జెసిబి లు పెట్టి ట్రాక్టర్లు నడుస్తున్న అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం వెనక పలు అనుమానాలకు తావిస్తోంది. ఏది ఏమైనాప్పటికీ చెరువు చుట్టూ ఉన్న రైతులు లబోదిబోమంటున్నారు.భూగర్భ జలాలు పాతాళానికి వెళ్ళిపోయి అవస్థలు పడుతుంటే ఇంకా మొరం తీయడంతో పూర్తిగా జలాలు అట్ట అడుక్కు వెళ్లిపోయి పంట సాగుకు ఇబ్బందులు ఏర్పడతాయని రైతులు ఆవేదన వేల్లా బోసుకుంటున్నారు.

ఇటు త్రాగునీటికి కూడా గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని గ్రామ ప్రజలు కూడా అసహనంతో ఉన్నారు. మొరం మట్టి.తో ట్రాక్టర్లు నడవడంతో ఆర్అండ్ బి వేసిన రోడ్లు పూర్తిగా ధ్వంసం అవుతున్నాయి వాటిని పట్టించుకున్న నాథుడు లేడు రోడ్లు చెడిపోతే వచ్చేది వర్షాకాలం వాహనాలు నడవడానికి ప్రజలు ప్రయాణాలు చేయడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇప్పటికైనా అధికారులు వెళ్లి మొరం తవ్వకాలను నిలిపి వేయవలసిందిగా స్థానికులు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking