సాంకేతిక విప్లవ ప్రదాత… రాజీవ్

సాంకేతిక విప్లవ ప్రదాత… రాజీవ్

ప్ర‌జా భ‌వ‌న్‌లో ఘ‌నంగా రాజీవ్ గాంధీ వ‌ర్థంతి

 మంత్రి సీత‌క్క‌

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

పేదల పెన్నిధి దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు పంచాయ‌తీ రాజ్ గ్రామీణాభివృద్ధి, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ద‌న‌స‌రి అన‌సూయ సీత‌క్క ఆధ్వ‌ర్యంలో ప్ర‌జా భ‌వ‌న్‌లో శుక్రవారం ఘనంగా జరు పుకున్నారు. రాజీవ్‌ గాంధీ చిత్రపటానికి పలువురు నేతలు పూల మాలలు వేసి నివాళి ఆర్పించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి సీత‌క్క మాట్లాడుతూ… భారతదేశానికి ప్రధాన మంత్రిగా ప్రజలకు చేసిన సేవలు, అభివృద్ది గురించి వివరించారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌ గాంధీ సేవలు మరువలేనివని అన్నారు. ఉన్నప్పుడు వెనకబడిన వర్గాల కోసం ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు.

రాజీవ్ గాంధీ బడుగు బలహీన వర్గాల నాయకుడు, నవ భారత నిర్మాణ సృష్టికర్త దేశానికి దిశా నిర్దేశం చూపిన మార్గదర్శకుడు రాజీవ్‌గాంధీ అని గుర్తు చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన భారత దేశాన్ని నిలిపిన ఘనత ఆయనదేనని గుర్తుచేశారు. దేశంలో బీదరికాన్ని పారద్రోలి సమసమాజ స్థాపనకు ఆయన చేసిన కృషి ఎప్పటికి మరవలేమని కొనియాడారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking