దుష్ప్రచారంపై జడ్జి ఆవేదన..

దుష్ప్రచారంపై జడ్జి ఆవేదన..

 సోషల్‌ మీడియాలో పోస్టులపై జస్టిస్‌ మాధవీదేవి విచారం

హైదరాబాద్ అక్షిత ప్రతినిధి 

బండి సాయిభగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు న్యా యమూర్తి జస్టిస్‌ టీ మాధవీదేవి సోషల్‌ మీడియాలో తన మీద జరుగుతున్న దు ష్పచారంపై తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. కేసు విచారణను తాను కొనసాగించడంపై ఎవరికైనా చిన్నపాటి అభ్యంతరం ఉన్నా వెంటనే చెప్పాలని, విచారణ నుంచి తప్పుకోవడానికి వెనుకాడబోనని స్పష్టం చేశారు.వేసవి సెలవుల బెంచ్‌ను నిర్వహించిస్తున్న జస్టిస్‌ మాధవీదేవి కోర్టులో భారీ సంఖ్యలో కేసులు ఉండటంతో భగీరథ్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ శుక్రవారం రాత్రి సుమారు 9 గంటలు దాటిన తర్వా త ప్రారంభమైంది. విచారణ ప్రారంభానికి ముందే న్యాయమూర్తి.. ఈ కేసులో వాదనలు వినిపించడానికి వచ్చిన న్యాయవాదులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.బాధితురాలి తరఫు సీనియర్‌ న్యాయవాది పప్పు నాగేశ్వరరావు, పిటిషనర్‌ తర ఫు న్యాయవాది, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కూ డా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. ‘మీలో ఎంతమంది సోషల్‌ మీడియాలో ఉన్నారు? అకడ జరుగుతున్న స్మియర్‌ క్యాంపెయిన్‌ (దుష్ప్రచారాన్ని) గమనించారా?అని జస్టిస్‌ మాధవీదేవి ప్రశ్నించారు. తనపై ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తూ, తప్పుడు ఉద్దేశాలను ఆపాదిస్తూ ప్రచారం జరగడం బా ధాకరమని వాపోయారు. ‘కొందరు నన్ను ప్రభావితం చేస్తున్నారంటూ తప్పు డు ప్రచారం చేస్తున్నారు.నాకు ఆశ చూ పుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి’ అంటూ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ దశలో సీనియర్‌ న్యాయవాది ఎస్‌ నిరంజన్‌రెడ్డి స్పందిస్తూ, ఇదేమీ కొత్త విషయం కాదని, గతంలో కూడా ఇదే తరహా ప్రచారం సా గిందని అన్నారు. పీపీ పల్లె నాగేశ్వరరావు మాట్లాడుతూ.. న్యాయమూర్తిపై సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారంపై హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లి, తక్షణ చర్యలు తీసుకోవాలని కోరిన ట్టు తెలిపారు. సీనియర్‌ న్యాయవాది ఎస్‌ నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ, న్యాయవ్యవస్థను భయపెట్టే ప్రయత్నాలు గతంలో కూడా జరిగాయని వ్యాఖ్యానించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking