నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు.. 10 లీటర్ల సారా స్వాధీనం
మహబూబాబాద్, అక్షిత బ్యూరో:
నర్సింహులపేట మండలం జగ్గూ తండ పరిధిలోని చింతల్ తండాలో అక్రమ నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఎస్‌ఐ బానోత్ వెంకన్న ఆధ్వర్యంలో చేపట్టిన ఈ దాడుల్లో 10 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని, 700 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. అక్రమంగా నాటుసారా తయారు చేస్తున్న పలువురిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వెంకన్న తెలిపారు. అక్రమ నాటుసారా తయారీ, విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.