తిమ్మాపూర్ లో ఘనంగా ‘హర ఘర్ తిరంగా’ ర్యాలీ.
జాతీయ స్ఫూర్తిని చాటిన బిజెపి శ్రేణులు
తిరంగా ర్యాలీలో పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం
మానకొండూర్ అక్షిత న్యూస్
హర్ గర్ తిరంగా అభియాన్ ప్రోగ్రాం లో భాగంగా గురువారం తిమ్మాపూర్ భారతీయ జనతా పార్టీ శాఖల ఆధ్వర్యంలో నల్లగొండ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం నుండి అలుగునూర్ వరకు ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ప్రోగ్రాంకు ముఖ్యఅతిథిగా హాజరైన బిజెపి జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం ర్యాలీనీ ప్రారంభించారు. ప్రోగ్రాం ముందు నల్లగొండ జడ్పీ స్కూల్ విద్యార్థులతో స్థానికంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దేశభక్తి కలిగి ఉండాలని ఉద్దేశంతో , దేశ ఐక్యత కోసం హర్ ఘర్ తిరంగా అభియాన్ పేరిట ర్య భారత ప్రభుత్వం 2022 నుండి ‘ఈ ప్రోగ్రాం ప్రతి ఏటా నిర్వహిస్తుందని తెలిపారు. ముఖ్యంగా ప్రజలలో దేశభక్తిని పెంపొందించడానికి, జాతీయ జెండాతో ప్రతి పౌరుడికి గల బంధాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ వేడుక ఎంతగానో దోహదపడుతుందన్నారు.కేవలం అధికారిక వేడుకలకే పరిమితం కాకుండా, ప్రతి ఒక్కరూ జాతీయ జెండాతో ప్రత్యక్షంగా మమేకం కావాలనే లక్ష్యంతో ఈ అభియాన్ కొనసాగుతోందన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన మహానీయులను వారి త్యాగాలను ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలనీ , ప్రతి ఇల్లు, కార్యాలయాలు, వ్యాపార సముదాయాలపై మువ్వన్నెల జెండాను గర్వంగా ఎగరవేయాలని కోరారు. 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను యువత, విద్యార్థులు, స్థానిక ప్రజల భాగస్వామ్యంతో భారీ ప్రదర్శనలు నిర్వహించడం ద్వారా కుల, మత, ప్రాంతీయ భేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా జాతీయ పండుగను జరుపుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. దేశ ప్రజలందరిలో సమైక్యతను, సమగ్రతను చాటిచెప్పడంతో పాటు భావితరాలకు జాతీయ చిహ్నాల పట్ల గౌరవం, దేశం పట్ల బాధ్యతను పెంపొందించే మహత్తర కార్యక్రమంగా ‘హర్ ఘర్ తిరంగా’ చరిత్రలో నిలిచిపోతుందన్నారు.తిరంగా ర్యాలీ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుగొండ నాగేశ్వర్ రెడ్డి, సీనియర్ నాయకులు గుజ్జ శ్రీనివాసరావు, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి అడిచర్ల రాజు , జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర మండలాధ్యక్షులు చింతం శ్రీనివాస్ , ప్రధాన కార్యదర్శి తిరుపతి రెడ్డి , బీజేవైఎం అధ్యక్షులు గడ్డం అరుణ్ , మువ్వరపుసంపత్ , బూట్ల శ్రీనివాస్, కొయ్యడ శ్రీనివాస్ , వేల్పుల ఓదెలు , పాఠకుల చోక్కయ్యలతోపాటు ముఖ్య నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.