ఆగష్టు18న సర్వాయి పాపన్న గౌడ్ 376 జయంతి నిర్వహించాలి

ఆగష్టు18న సర్వాయి పాపన్న గౌడ్ 376 జయంతి నిర్వహించాలి

కొమురవెల్లి అక్షిత న్యూస్:

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల కేంద్రంలో గురువారం గౌడ జన హక్కుల పోరాట సమితి మోకు దెబ్బ మండల అధ్యక్షులు మెరుగు కృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి,జిల్లా స్థాయి నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మెరుగు కృష్ణ గౌడ్ మాట్లాడుతూ ఆగస్టు 18 తారీకున సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376 వ జయంతి సందర్భంగా కొమరవెల్లి మండలంలోని అన్ని గ్రామాలలో జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఈ సందర్భంగాపిలుపునిచ్చారు.అలాగే సిద్దిపేట జిల్లా అధ్యక్షులు పచ్చిమట్ల స్వామి గౌడ్ మాట్లాడుతూ ఆగస్టు 18న పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలను మండలంలోని అన్ని గ్రామాలలో గౌడ కులస్తుల తో పాటు అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కోరారు. అలాగే అన్ని గ్రామాల నుండి బైక్ ర్యాలీ నిర్వహించి మండల కేంద్రానికి చేరుకోవాలని కోరారు.అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం గీతాకార్మికులకు కొత్తగా పింఛన్లు ఇవ్వడం జరుగుతుంది. అర్హులైన అప్లై చేసుకున్న గీతా కార్మికులకు అందరికీ పింఛన్లు అందజేయాలని ఈ సందర్భంగా కోరుతున్నానని అన్నారు.  అంతేకాదు అర్హులై ఉండి ఇంకా పింఛన్ దరఖాస్తు చేసుకొని వారు ఎవరైనా ఉంటేవెంటనేగ్రామపంచాయతీ కార్యదర్శి దగ్గరకు కానీఎంపీడీవోకార్యాలయంకు కానీ వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని గీతా కార్మికులను కోరారు.ఈ కార్యక్రమంలో మోకు దెబ్బ జాతీయ ఉప అధ్యక్షులు ముత్యం నరసింహులు గౌడ్,జిల్లా యూత్ అధ్యక్షులు దొమ్మాట రమేష్ గౌడ్, జిల్లా కార్యదర్శి ముత్యం విజయ్ కుమార్ గౌడ్, మండల యూత్ అధ్యక్షులు బుడిగే రమేష్ గౌడ్,మాజీ ఎంపీటీసీ కొయ్యడ శ్రీనివాస్ గౌడ్, మెరుగుల లక్ష్మయ్య, యాదగిరి,గనిబోయిన కనకయ్య,రాములు, కనకయ్య,కిరణ్,సత్తయ్య, అన్ని గ్రామాల గౌడ సంఘాల పెద్దలు సంఘం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking