ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత విద్యా సామగ్రి పంపిణీ…

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత విద్యా సామగ్రి పంపిణీ…

ప్రిన్సిపాల్‌ విజయలక్ష్మి

లోకేశ్వరం, ఆగస్టు 13 అక్షిత న్యూస్ : 

నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం విద్యార్థుల విద్యాభ్యాసానికి ప్రోత్సాహం అందించేందుకు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఉచిత విద్యా సామగ్రిని పంపిణీ చేశారు. కళాశాల ప్రిన్సిపాల్‌ విజయలక్ష్మి గురువారం విద్యార్థులకు బ్యాగులు, నోట్‌బుక్కులు తదితర సామగ్రిని స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుపై పూర్తి దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించే దిశగా కృషి చేయాలని సూచించారు. విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అందించిన విద్యా సామగ్రిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యతో పాటు క్రమశిక్షణ, మంచి నడవడికను అలవర్చుకుని కళాశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు,సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు…

Leave A Reply

Your email address will not be published.

Breaking