సదరం క్యాంపు కొత్త భవనం ప్రారంభోత్సవం
నాగర్కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి
నాగర్ కర్నూల్, అక్షిత ప్రతినిధి
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజీలో సదరు క్యాంపు నూతన భవనం ప్రారంభోత్సవం నాగర్కర్నూల్ శాసనసభ్యులు రాజేష్ రెడ్డి, ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో ఉన్న దివ్యగుల కొరకు వివిధ రకాలైన పరీక్షలను నిర్వహించడం కొరకు సదరు క్యాంపు ఎంతో దోహదపడుతుందని తెలిపారు.. గతంలో స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ లో ఈ సదరం వసతులు కూడా సక్రమంగా లేకపోవడంతో క్యాంపును నిర్వహించే వారు ,అయితే అక్కడ చాలా ఇబ్బందిగా దివ్యాంగులు చాలా ఇబ్బందులకు గురి అయినారు. కావున ప్రస్తుతం మెడికల్ కాలేజిలో విశాలమైన గదులు, చక్కటి వాతావరణంలో ఈ సదరం క్యాంపు ను ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతినెల సదరం క్యాంపుకు పరీక్షల నిమిత్తం 800 సదరం స్లాట్స్ ను ఆన్లైన్లో లో నమోదు కావడం జరుగుతుంది. ఇందులో శారీరక వికలాంగులు బుద్ధిమాంద్యం, పైలిరియా, వినికిడి లోపం, కంటి చూపు లోపం మొదలగు దివ్యాంగులు ఈ సదరం క్యాంపుకు హాజరు కావడం జరుగుతుంది. అయితే ప్రతినెల సదరంక్యాంపుకు వచ్చే దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా క్యాంపు సిబ్బంది మరియు డాక్టర్స్ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని పరీక్షలను నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దేవాసహాయం, డి ఆర్ డి ఓ చిన్న ఓబులేసు, అదనపు డి ఆర్ డి ఓ బి. రాజేశ్వరి, మార్కెటింగ్ చైర్మన్ రమణ రావు, మున్సిపల్ చైర్మన్ సురేందర్, స్థానిక కౌన్సిలర్ అనంత అలివేలమ్మ, ఆర్ ఎం ఓ రవిశంకర్, రమాకాంత్, డాక్టర్స్ డిపిఎం శ్రీనివాసులు, ఏపీఎం సహదేవ్, దివ్యాంగుల అధ్యక్షులు శ్రీశైలం, సదరం క్యాంపు సిబ్బంది మరియు దివ్యాంగులు పాల్గొన్నారు.
