కవితమ్మ సీఎం కావాలంటూ ప్రత్యేక పూజలు 

కవితమ్మ సీఎం కావాలంటూ ప్రత్యేక పూజలు 

–  రాష్ట్రాన్ని ఒక తల్లిలా పాలించాలి 

–  దండుమైసమ్మ ఆలయంలో పూజలు చేసిన కృష్ణవేణి

ఆత్మకూరు ఎస్, అక్షిత న్యూస్ :

తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవితమ్మ తెలంగాణ రాజకీయాల్లో ఉన్నత స్థాయికి చేరి రాష్ట్రాన్ని ఒక తల్లిలా పరిపాలించాలని కోరుతూ సూర్యాపేట జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు సూరారపు కృష్ణవేణి బుధవారం ఆత్మకూరు ఎస్ మండలం దండుమైసమ్మ ఆలయంలో ప్రత్యక పూజలు నిర్వహించారు. పార్టీ నేతలతో కలిసి ఆలయంలో కవిత పేర అర్చన చేయించి అమ్మ వారిని మొక్కుకున్నారు. కవితక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని, ప్రజలకు సుభిక్ష పాలన అందించాలని, రాజకీయ భవిష్యత్ బంగారు మయం కావాలని దండు మైసమ్మ తల్లి కోరుకున్నామని కృష్ణవేణి తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి కృష్ణవేణికి అమ్మవారి ఆశీర్వచనం అందించి, చీరను బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఎస్ మండలం నాయకులు గజవెల్లి ఉప్పలాచారి, గీత, గుండాల లింగయ్య, చింతకుంట్ల నాగేందర్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking