చదువుకున్నోడికి చావు దెబ్బ.. నీట్ కుంభకోణంపై యువజన కాంగ్రెస్ సమర శంఖం!

చదువుకున్నోడికి చావు దెబ్బ.. నీట్ కుంభకోణంపై యువజన కాంగ్రెస్ సమర శంఖం!

రామన్నపేటలో ఉద్రిక్తత ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం.. 

రామన్నపేట అక్షిత ప్రతినిధి 

నీట్ పేపర్ లీకేజీ ఘటనపై కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ రామన్నపేట మండల యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రంలోని సుభాష్ సెంటర్‌లో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బట్టె సంతోష్ కుమార్ మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వ హయాంలో వరుసగా పేపర్ లీకులు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. గత పదేళ్లలో 89 పేపర్ లీకులు చోటుచేసుకోగా 48 సార్లు మళ్లీ పరీక్షలు నిర్వహించడం దారుణమని విమర్శించారు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్న కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ జమీరుద్దీన్, కాంగ్రెస్ నాయకులు వనం చంద్రశేఖర్, కోట సుధాకర్, కేశవదాసు వెంకటేష్, బొడ్డు సురేందర్‌రావు, ఏటెల్లి పరమేష్, చల్లా సత్యప్రకాష్, బండ లింగస్వామి, ఇనాయతుల్లా బైగ్, గుండాల సతీష్, పెరమల్ల నవీన్, తెల్ల శేఖర్, మహిళా కాంగ్రెస్ నాయకురాలు బైరబోయిన శోభా, యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కల్లూరి శివ, కందగట్ల రాహుల్, నాయకులు పల్లపు రవి, జవ్వాజి శ్రీకాంత్, కన్నెబోయిన రవీందర్, సింగరాజు యశ్వంత్, అంజద్, అజార్, కందుల మణి, నల్లబాల శరత్, సుర్వి మచ్చగిరి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking