పాఠశాల అభివృద్ధికి అందరూ సహకరించాలి.

పాఠశాల అభివృద్ధికి అందరూ సహకరించాలి.


–  బోగారం తల్లిదండ్రుల సమావేశంలో సర్పంచ్ సాయికుమార్ గౌడ్

రామన్నపేట అక్షిత ప్రతినిధి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు రామన్నపేట మండలంలోని బోగారం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల అడ్మిషన్లు, పాఠశాల అభివృద్ధి, సమ్మర్ క్యాంపు నిర్వహణ తదితర అంశాలపై తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు.కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ హాజరై మాట్లాడారు.ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. పాఠశాల అభివృద్ధికి గ్రామస్తులందరూ సహకరించాలని కోరారు. విద్యార్థుల ప్రతిభాభివృద్ధికి సమ్మర్ క్యాంపులు ఉపయోగపడతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బైకాని ఉమామహేష్ యాదవ్, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ పబ్బు జ్యోతి, వార్డు సభ్యులు కనుక మల్లేష్, నేరటి మానస సురేష్ యాదవ్, కడారి పావని పాపయ్య, గోగు సురేష్ యాదవ్, వనం అండాలు యాదగిరి, ప్రధానోపాధ్యాయుడు ముస్కా వెంకట్‌రెడ్డి, ఉపాధ్యాయులు శ్రీలత, శేఖర్, గ్రామస్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking