ఉద్యమకారులకు సముచిత స్థానం

ఉద్యమకారులకు
సముచిత స్థానం

తెలంగాణ ఉద్యమకారుల సంఘం జిల్లా ఇంచార్జ్ ల నియామకం

డాక్టర్ పిడమర్తి రవి

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

తెలంగాణ ఉద్యమకారులకు సముచిత స్థానం లభించనుందని తెలంగాణ ఉద్యమకారుల సంఘం వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం సాధన కోసం ఏర్పడిన తెలంగాణ ఉద్యమకారుల సంఘం పది జిల్లాలకు ఇంచార్జీలను నియమిస్తూ నియామక పత్రాన్ని తెలంగాణ ఉద్యమకారుల సంఘం వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి విడుదల చేశారు. మహబూబ్ నగర్ కు విష్ణువర్ధన్ గౌడ్, ఖమ్మం రడం సురేష్, వరంగల్ గుజ్జుల శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ దేవిరెడ్డి విజయ్, మెదక్ కుమార్ సాగర్, నిజామాబాద్ శ్రీనివాస్ గౌడ్, ఆదిలాబాద్ శ్రవణ్ నాయక్, హైదరాబాద్-శివ గౌడ్, రంగారెడ్డి -సంజయ్ గౌడ్, కరీంనగర్ పాలెపు దిలీప్ లను నియమించినట్లు వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి తెలిపారు. కోఆర్డినేటర్స్ గా ఉపేందర్, ఎస్ కె రహీoలను నియమించినట్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking