భారీ వర్షం.. చిద్రమైన దారి
కోతకు గురైన రోడ్… నిలిచిన రాకపోకలు
భారీ వర్షానికి కొట్టుకుపోయిన రహదారి...
జనగామ హుస్నాబాద్ మధ్య నిలిచిన
రాకపోకలు
జనగామ, అక్షిత ప్రతినిధి:
వరుణుడు వనికిస్తుండ్రు. భారీ వర్షాలతో రహదారి చిద్రమైంది. జనగామ హుస్నాబాద్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.జనగామ జిల్లా కేంద్రం నుండి హుస్నాబాద్ వైపు వెళ్లే రహదారి గానుగుపహాడ్ వద్ద వరద తాకిడికి కొట్టుకు పోయినా సంఘటాన ఆదివారం రోజున చోటుచేసుకుంది…

అతిగా కురుస్తున్న భారీ వర్షానికి పైనుండి వస్తున్న వరదకి రోడ్డు మొత్తం కొట్టుకుపోవడం జరిగిందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని…ప్రజలు బయటికి రావద్దని… జిల్లా అదికారులు కోరుతున్నారు. జనగామ హుస్నాబాద్ ఇరువైపులా భారీగా రాకపోకలు నిలిచిపోయాయి…