విద్యార్థులకి స్టడీ మెటీరియల్ పంపిణి 

విద్యార్థులకి స్టడీ మెటీరియల్ పంపిణి 

– ఉద్యోగాలకు సిద్ధం కావాలి 

– రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొంపల్లి నరేష్ మాదిగ 

హైదరాబాద్ అక్షిత ప్రతినిధి 

ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ లకు విద్యార్థులు సిద్ధంగా ఉండాలని తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొంపల్లి నరేష్ మాదిగ అన్నారు. తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చుక్క శ్రీనివాస్ మాదిగ ఆధ్వర్యంలో గురువారం నాడు హైదరాబాదులోని రాష్ట్ర కార్యాలయంలో నరేష్ తన సొంత ఖర్చులతో స్పాన్సర్ చేస్తూ విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ పుస్తకాల కిట్ ను అందజేశారు. అనంతరం కొంపల్లి నరేష్ మాట్లాడుతూ పంపిణీ చేస్తున్న పుస్తకాలు ఉచితంగా వచ్చాయి అని ధోరణి వీడి ప్రతి ఒక్క విద్యార్థి శ్రద్ధతో చదువుకొని ఉద్యోగాలకు ఎంపిక కావాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా ప్రభుత్వం వస్తేనే నిరుపేదల బతుకులు మారుతాయని ఏ ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టిన, ప్రభుత్వాలు మారిన నిరుద్యోగుల జీవితాలు బ్రతుకులు మారడం లేదని అన్నారు. హైదరాబాదులోని ఎన్నో కోచింగ్ సెంటర్ లలో పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతూ ఒక పూట ఉపవాసం ఉంటూ అయినా సరే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని వెంటనే నియమాకాల ప్రక్రియ చేపట్టి నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కడియం రాంబాబు, మహిళా సంఘం అధ్యక్షులు సరస్వతి, నాయకులు మాధవి, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking