ఓటర్ల మ్యాపింగ్ గడవు పొడిగించాలి

*- ఓటర్ల మ్యాపింగ్ గడవు పొడిగించాలి*

*- కలెక్టర్ సబ్ కలెక్టర్ కు బిఆర్ఎస్ నాయకులు పటేల్ కరుణాకర్ విజ్ఞప్తి*

*తాండూరు, అక్షిత ప్రతినిధి :

ఈనెల24వ తేదీ ఓటర్ మ్యాపింగ్ చివరి తేదీగా ప్రకటించడం చాలా విడ్డూరం, బిఆర్ఎస్ పార్టీ నాయకులు పటేల్ కరుణాకర్ మండి పడ్డారు. సోమవారం ఓ ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలను కష్టాల పాలు చేస్తున్నట్లుగా అనిపిస్తుందని అన్నారు. ఇంకా చాలా మందికి ఎస్ఐఆర్ ఓటర్ ఎన్యు మరేషన్ దరఖాస్తు ఫారమ్స్ అందలేదని మండిపడ్డారు. ఇలా అయితే ఎంతోమంది ఓట్లు గల్లంతు కావడానికి ఆస్కారం ఉందని పేర్కొన్నారు. ఇది ప్రజా స్వామ్యానికి చాలా విఘాతం కలిగిస్తుందని, తెలిపారు. ఒకసారి ఇంతవరకు తాండూరులో ఏ వార్డులో ఎంత ఓటర్ మ్యాపింగ్ జరిగిందో బహిరంగ ప్రకటన చేయాలినీ డిమాండ్ చేశారు. కొన్ని వార్డులలో 40 శాతం కూడా జరగలేదు? మీరు డెడ్ లైన్ ఎలా విధిస్తారని అధి కారులకు ప్రశ్నించారు. కొంత మందికి 2002 ఓటు హక్కు ఎక్కడ ఉందో తెలియట్లేదు, సరైన పత్రాలు లేవు, కుల ధ్రువీకరణ పత్రాలు లేవు, టెన్త్ సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేయడానికి చదువు కోలేదు, పాస్ పోర్ట్ అసలే లేవు ఈ సందర్భంగా గుర్తు చేశారు. తాండూరు నియోజకవర్గ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని, జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్, వెంటనే స్పందించి, ఓటర్ మ్యాపింగ్ గడువు పొడిగించాలని, తాండూరు ప్రజల తరపున బిఅర్ఎస్ పార్టీ తరపున సీనియర్ నాయకులు పటేల్ కరుణాకర్ విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking