తెలంగాణా చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కార్యదర్శిగా పెండెం లక్ష్మీనారాయణ
రామన్నపేట అక్షిత ప్రతినిధి
చౌటుప్పల్ మండలంలోని దండుమల్కాపూర్‌లోని శ్రీ అందోల్ మైసమ్మ తల్లి దేవస్థానం పరిధిలో నిర్వహించిన రాష్ట్ర కమిటీ సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీరమోహన్ నియామక ఉత్తర్వులను అందజేశారు. అనంతరం పెండెం లక్ష్మీనారాయణను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ, చేనేత కార్మికుల సంక్షేమం కోసం వారి సమస్యల పరిష్కారంలో ముందుండి పనిచేయాలని నూతన రాష్ట్ర కార్యదర్శికి సూచించారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు రాపోలు రాజశేఖర్, క్రమశిక్షణ కమిటీ సభ్యులు బూరుగు వెంకటేశం, కోశాధికారి జెల్ల రఘు తదితరులు పాల్గొన్నారు.