హెల్మెట్ ధరించండి ప్రాణాలు కాపాడుకోండి.

హెల్మెట్ ధరించండి ప్రాణాలు కాపాడుకోండి.

బిఆర్ఆర్ చైర్మన్ బూడిద రాంరెడ్డి ఆధ్వర్యంలో హెల్మెట్ల పంపిణీ

 రంగారెడ్డి అక్షిత బ్యూరో

ఇబ్రహీంపట్నం పట్టణ కేద్దంలో హెల్మెట్ ధరించి ప్రాణాల్ని కాపాడు కోవాలని బి ఆర్ ఆర్ ఫౌండేషన్ ఛైర్మెన్ బూడిద రాం రెడ్డి వెయ్యి మందికి ఉచిత హెల్మెట్ లను పంపిణీ చేసారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం లోని శాస్త్ర గార్డెన్స్ లోని నియోజక వర్గ వాహన దారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యతుదిగా ఐపీఎస్ శివ ఉపాధ్యాయ హాజరయ్యారు. వాహనదారులు బైక్ ల ప్రయాణించే సమయం లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ , సీటు బెల్టు ను ధరించాలని, కుటుంబానికి అండగా ఉండాలని ఐపీఎస్ సూచించారు. బిఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బూడిద రాంరెడ్డి మాట్లాడుతూ గంజాయి , డ్రగ్స్ వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని , విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలని వారికి అండగా ఉంటామని , విద్యార్థులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ సి.హెచ్. జితేందర్ రెడ్డి, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది, బి ఆర్ఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking