పల్లె దవఖానాలు మెరుగైనవై ద్యం అందించాలి

పల్లె దవఖానాలు మెరుగైనవై ద్యం అందించాలి

ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి

కోదాడ, అక్షిత ప్రతినిధి :

గ్రామీణ ప్రాంతాలలో ఏర్పాటు చేస్తున్న పల్లె దవఖానాలు నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించాలని స్థానిక ఎమ్మెల్యే ఉత్తం పద్మావతి రెడ్డి అన్నారు . వైద్యులు కార్పొరేట్ వైద్యం అందించి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని అన్నారు.శనివారం చిల్కూరు మండల పరిధిలోని నారాయణపురం, పాలే అన్నవరం గ్రామములో టిజి ఎంఐ డి సి నిధుల నుండి మంజూరైన 20 లక్షల రూపాయల తో నిర్మించిన పల్లె దవఖానాను సూర్యాపేట డి ఎంఅండ్ హెచ్ వో వెంకటరమణ, స్థానిక సర్పంచ్ మండవ జయమ్మ వెంకటేశ్వర్లు తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిరుపేదలందరికీ నాణ్యమైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం వైద్య రంగానికి కేంద్ర ప్రభుత్వంతో కలిసి పెద్దపీట వేస్తుందని తెలిపారు గ్రామములో ప్రతి ఒక్కరూ పల్లె దవాఖానాలు సద్వినియోగం చేసుకొని ఆరోగ్యం వంతులుగా ఉండాలని తెలిపారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ జయమ్మ గ్రామములోని మౌలిక సదుపాయాలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకు వెళ్లారు దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు దశలవారీగా ఒక్కొక్కటి అమలు చేస్తున్నానని మిగిలిన సమస్యలు కూడా పరిష్కరిస్తానని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారుఈ కార్యక్రమంలో గ్రామ వైస్ సర్పంచ్ గంధం లింగస్వామి,కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పందిరి వీరబాబు, సిపిఐ కార్యదర్శి కందుకూరి శ్రీను, వార్డు మెంబర్ మండవ గోపయ్య, కొండ సైదయ్య,కీసర కొండలు, సూర్యాపేట డిఎం అండ్ హెచ్ ఓ వెంకటరమణ డిప్యూటీ డి ఎం ఎం హెచ్ ఓ మాధవ కుమార్ పిహెచ్సి చిల్కూరు మెడికల్ ఆఫీసర్ సుభాష్ ఎంఎల్ హెచ్పి భగవాన్ వైద్య సిబ్బంది ఆశా వర్కర్లు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking