అంగన్‌వాడీ ఉపాధ్యాయురాలికి ఘన సన్మానం

అంగన్‌వాడీ ఉపాధ్యాయురాలికి ఘన సన్మానం

పదవీ విరమణ సందర్భంగా సేవలను కొనియాడిన సర్పంచ్ లలిత భోజన్న…

లోకేశ్వరం, జులై 4 అక్షిత న్యూస్ :

నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని మన్మద్ గ్రామంలో అంగన్‌వాడీ ఉపాధ్యాయురాలిగా సుదీర్ఘకాలం సేవలందించిన గోడిసెల గంగామణి పదవీ విరమణ సందర్భంగా గ్రామ సర్పంచ్ లలిత,భోజన్న, ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా సర్పంచ్ లలిత మాట్లాడుతూ,చిన్నారుల విద్య, ఆరోగ్యం,మహిళల సంక్షేమం కోసం గంగామణి ఎంతో నిబద్ధతతో సేవలందించారని కొనియాడారు. ఆమె సేవలు గ్రామానికి ఆదర్శప్రాయమని పేర్కొంటూ,పదవీ విరమణ అనంతరం కూడా ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో ఉప సర్పంచ్ గీతా భవాని,సాయిప్రసాద్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొని గంగామణికి శాలువా కప్పి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు…

Leave A Reply

Your email address will not be published.

Breaking