ఘనంగా ఎర్రబెల్లి దయాకర్ రావు జన్మదిన వేడుకలు
మహా అన్నదానం నిర్వహించిన బీఆర్ఎస్ శ్రేణులు
రాయపర్తి అక్షిత ప్రతినిది
మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి, రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జననాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావుకు దీర్ఘాయుష్షు, సంపూర్ణ ఆరోగ్యం కలగాలని ఆకాంక్షిస్తూ నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఎస్‌ఆర్‌ఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. అనంతరం సుమారు 500 మందికి మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించి కార్యకర్తలు, ప్రయాణికులు, ప్రజలకు ప్రేమతో భోజనాలు వడ్డించారు. ఈ కార్యక్రమం సేవా భావానికి నిదర్శనంగా నిలిచిందని పలువురు కొనియాడారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం సేవలందిస్తున్న ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని పేర్కొన్నారు. ఆయన మరెన్నో సంవత్సరాలు ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ మాజీ అధ్యక్షులు మునవత్ నర్సింహా నాయక్, మాజీ ఎంపీపీ జినుగు అనిమి రెడ్డి, మాజీ జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, పి ఏ సి ఎస్ చైర్మన్ కుందూరు రామ్ చంద్రా రెడ్డి, మండల పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి పూస మధు, రాష్ట్ర ఎస్టీ యూనియన్ ఉపాధ్యక్షులు సురేందర్ రాథోడ్, మండల పార్టీ నాయకులు లేతకుల రంగా రెడ్డి, కర్ర రవీందర్ రెడ్డి, ఐత రామ్ చందర్, తాళ్లపెల్లి సంతోష్ గౌడ్, సంకినేని ఎల్లస్వామి, మండల కమిటీ నాయకులు, సర్పంచ్‌లు, యూత్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.