మహాలక్ష్మి మాకేది ? …అక్షిత కథనానికి స్పందన
రామన్నపేట అక్షిత ప్రతినిధి
అక్షిత దిన పత్రికలో గత వారం రోజుల క్రితం మహాలక్ష్మి మాకేది అనే ప్రత్యేక కథనం ప్రచురితం అయిన విషయం అందరికీ తెలిసినది. ఎట్టకేలకి రాజకీయంగా వేడి రగిలి ఆర్టీసీ అధికారులలో కదలికలు మొదలై సమస్య పరిష్కారం చేశారు. రామన్నపేట నుండి అమ్మనబోలు వరకు పలు గ్రామాల మీదుగా బస్సు సర్వీస్ ఉండటం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో నిండి పట్టణ ప్రాంతాలకు వెళ్లి ఉన్నత చదువులు అదేవిదంగా ఉద్యోగ రీత్యా వచ్చి వెళ్ళే వారికి చాలా కాలం నుండి సమస్య ఉండేది. అక్షిత దిన పత్రికలో ప్రచురితం కాగా ఎట్టకేలకు ఆర్టీసీ అధికారులు స్పందించి సమస్యకు చెక్ పెట్టారు. శనివారం నుండి అమ్మనబోలు నుండి రామన్నపేట వరకు బస్సు సర్వీసులు ప్రారంభించారు.