గూడెం గ్రామంలో ఘనంగా ఆరోగ్య పోషణ దినోత్సవం
చిన్నంబావి, అక్షిత న్యూస్:
చిన్నంబావి మండల పరిధిలోని గూడెం అంగన్వాడి కేంద్రంలో ఆరోగ్య పోషణ దినోత్సవం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ కొత్త వెంకట్ రెడ్డి పాల్గొని గర్భిణీలకు పోషకాహారం పంపిణీ చేశారు. పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే పిల్లలకు టీకాలు వేయించాలని కోరారు. అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు జిపిఓ రాజు సెక్రటరీ విక్రమ్ యాదవ్ ఉపసర్పంచ్ శోభ అంగన్వాడీ టీచర్ పార్వతమ్మ గర్భిణీ స్త్రీలు ఆశా వర్కర్లు గ్రామ ప్రజలు,ఇతరులు పాల్గొన్నారు.