మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డిని సన్మానించిన నాయకులు 

మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డిని సన్మానించిన నాయకులు 

రాయపర్తి అక్షిత ప్రతినిది

రెండోసారి ఏకగ్రీవంగా కాంగ్రెస్ పార్టీ రాయపర్తి మండల అధ్యక్షుడిగా ఎన్నికైన ఈదులకంటి రవీందర్ రెడ్డిని పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన స్వగృహానికి వెళ్లిన నాయకులు శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. పార్టీ బలోపేతానికి, కార్యకర్తల సంక్షేమానికి ఆయన నాయకత్వంలో మరింత కృషి చేసి కాంగ్రెస్ పార్టీని మండలంలో మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. మండల అభివృద్ధితో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి సమష్టిగా పనిచేస్తామని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూర్య తండా సర్పంచ్ మూనవత్ బాన్ష నాయక్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కళ్యాణ్ గౌడ్, సూర్య తండా మాజీ సర్పంచ్ మూనవత్ మాంజా నాయక్, రాయపర్తి మండల సీనియర్ నాయకుడు హకావత్ పంతులు, మాజీ పీఏసీఎస్ డైరెక్టర్ మూనవత్ రవి, మండల పార్టీ నాయకుడు చేవ్వు కాశినాధంతో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని నూతన అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking