జ్యువెలరీ దుకాణాల భద్రతపై పోలీసుల తనిఖీలు

జ్యువెలరీ దుకాణాల భద్రతపై పోలీసుల తనిఖీలు

మందమర్రి, అక్షిత ప్రతినిధి:

పోలీస్ కమిషనర్ అంబార్ కిశోర్ జా ఐపీఎస్, డీసీపీ ఎ. భాస్కర్, ఏసీపీ కిరణ్ కుమార్, సీఐ రమేష్ ఆదేశాల మేరకు రామకృష్ణాపూర్ పట్టణ ఎస్‌ఐ జే. శ్రీధర్ పలు జ్యువెలరీ దుకాణాలను శనివారం సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా సీసీ కెమెరాల పనితీరు, కవరేజీ, డీవీఆర్ రికార్డింగ్‌ను తనిఖీ చేసి, నాణ్యమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి 24 గంటలూ పనిచేసేలా నిర్వహించాలని దుకాణ యజమానులకు సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, వ్యాపారులు పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని ఎస్‌ఐ జే. శ్రీధర్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking