నాయకుడా వర్ధిల్లు నూరేళ్లు!
కృష్ణ ప్రసాద్ యాదవ్ జడ్పిటిసి సభ్యునిగా 20 ఏళ్ల ప్రస్థానం
చిన్నంబావి, అక్షిత న్యూస్ :
మండలం లక్ష్మీ పల్లి గ్రామ కృష్ణ ప్రసాద్ యాదవ్ రాజకీయ ప్రస్థానం…2004 నుండీ రత్నగిరి ఫౌండేషన్ లో కోఆర్డినేటర్ గా పనిచేస్తూ జూపల్లికృష్ణారావు ఆశీర్వాదంతో మొట్ట మొదటిసారిగా రాజకీయ రంగ ప్రవేశం చేసి 2006లో జడ్పిటిసిగా గెలుపొందారు. ఓటమి ఎరుగని నాయకునిగా ఉమ్మడి మండలంలో ఎదిగారు. 2014 లో ఎంపీటీసీగా కృష్ణ ప్రసాద్ భార్య లావణ్య గెలుపొందారు. జూపల్లి కృష్ణారావు ఆశీర్వాదంతో ఉమ్మడి మండలంలో ఎంపీపీ గా లావణ్య కృష్ణ ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రజల యొక్క ఆశీర్వాదంతో గ్రామానికి చేసిన అభివృద్ధిని గుర్తించుకొని గ్రామ ప్రజలు 2025లో మాతృమూర్తి అయిన ఇటిక్యాల పెంటమ్మ సర్పంచ్ గా గెలుపొందారు. జూపల్లి కృష్ణారావు ఆశీర్వాదంతో జడ్పీటీసీ సభ్యుడిగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి… తన నిరంతర పోరాట పటిమతో, ప్రజాబలంతో ఇటిక్యాల కృష్ణ ప్రసాద్ యాదవ్ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటూన్నాను. ఇరవై ఏండ్ల నమ్మకం… వందేళ్ల అనుబంధం! పదవులు మారినా, కాలం మారినా ప్రజల కోసం మీరు పడే తపన, మీపై మాకున్న అభిమానం ఎప్పటికీ మారవు. ప్రజాక్షేమమే ధ్యేయంగా సాగుతున్న మీ అభిమానానికి మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము.
సాధారణ కార్యకర్తగా ప్రస్థానం…
అసాధారణ పోరాటాలతో ప్రజా హృదయ విజేతగా స్థానం పొంది
జడ్పీటీసీ నుండి మీరు సాగించిన ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం.
మీతో మాకున్న ఇరవై ఏండ్ల బంధం… తరతరాల వందేళ్ల అనుబంధం.
వర్ధిల్లు నాయకుడా… వర్ధిల్లు నూరేళ్లు!”
కష్టాల్లో తోడుగా నిలిచి, కన్నీళ్లు తుడిచే గుణం ఉన్న నిజమైన ప్రజా నాయకుడు మన రేవంత్ అన్న. మీతో సాగిన ఈ 20 సంవత్సరాల ప్రయాణం ఎంతో అపురూపమైనది. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తూ, మీరు నూరేళ్లు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము. మాట ఇస్తే వెనకడుగు వేయని నైజం…జనమే శ్వాసగా సాగుతున్న మీ రాజకీయం నిండు నూరేళ్లు కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము