ప్రైవేటు పాఠశాలలో చదువుకునే జర్నలిస్టు పిల్లలకు100% ఫీజు రాయితీ కల్పించాలి.
పెద్ద అడిశర్లపల్లి, అక్షిత ప్రతినిధి
ప్రైవేటు షాట్ పాఠశాలలో చదువుకునే జర్నలిస్టు పిల్లలకు ఫీజు రాయితీ కల్పించాలని టి యు డబ్ల్యూ ఐ జే యు జిల్లా పిలుపుమేరకు నల్గొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండల కేంద్రంలోని ఎంఈఓ కి జర్నలిస్టులు వినతిపత్రం అందజేశారు. పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటివరకు జీవో ఇవ్వకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు జీవో ని విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు హైటెక్ శ్రీను, అచ్యుత్, సాయి,రవి,తిరుమల్ తదితరులు పాల్గొన్నారు