ప్రజల ఆరోగ్య సూత్రాలపై అవగాహన సదస్సు
– రిషారియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు
– అవగాహన కల్పించిన రియా మౌర్య
హైదరాబాద్ అక్షిత ప్రతినిధి
ప్రజలు ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ సంపూర్ణ ఆరోగ్యం తో జీవనం సాగించాలని రియా మౌర్య అన్నారు. హైదరాబాద్ లోని దోమలగూడ లో రిషారియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక అవగాహన సదస్సు లో అక్కడి ప్రజలకి ప్రజల ఆరోగ్యం పై అవగాహన కల్పించారు. అక్కడ మురికి కాలువలు ఎక్కువ ఉంది, దోమల బెడద ఎక్కువగా ఉంటుందని, వాటి వల్ల రానున్న రోజుల్లో వర్షాల కారణంగా మురికి నీ లేకుండా చేసుకోవాలని, ఇళ్ల చుట్టూ పక్కల ప్రదేశాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఆరోగ్యమే మహా భాగ్యం అనే నినాదం తో అందరూ ముందుకు సాగుతూ, ఆరోగ్యం పట్ల ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకూడదని, ఎలాంటి జబ్బుల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఆరోగ్యం పట్ల ఎలాంటి అనుమానం వచ్చిన వెంటనే వైద్యలను సంప్రదించాలని, రానున్న కాలంలో రిషారియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెడికల్ కాంపు లు ఏర్పాటు చేసి, ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.