కరెంట్ షాక్ తగిలి వ్యక్తి మృతి కరెంట్ షాక్ తగిలి వ్యక్తి మృతి
పెద్ద అడిర్లపల్లి అక్షిత ప్రతినిధి
పెద్ద అడిశర్లపల్లి మండలంలోని రంగారెడ్డిగూడెం గ్రామంలో బుధవారం కరెంట్ షాక్ తగిలి వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే రంగారెడ్డి గ్రామ శివారులోని నీలుగూరి శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయ పొలంలో కౌలుకు చేసేటువంటి ఫేక్ సైదా సన్నాఫ్ నన్నేసాబ్ వయస్సు 51 సంవత్సరాలు. అతని గ్రామం వెంకట్రామపురం మేళ్లచెరువు మండలం సూర్యాపేట జిల్లా అతను ప్రమాదవశాత్తు ట్రాన్స్ఫార్మర్ ఫీజు సరి చేయడానికి అని వెళ్లి కరెంట్ షాక్ తో మృతి చెందడం జరిగింది.అతని భార్య రంజాన్ బి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ నరసింహులు తెలిపారు.