రామన్నపేటలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు
– తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ
రామన్నపేట అక్షిత ప్రతినిధి
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని రామన్నపేటలో బీజేపీ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షులు బండ మధుకర్ రెడ్డి ఆధ్వర్యంలో రామన్నపేట సుభాష్ సెంటర్‌లో భారత త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.అనంతరం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడంతో పాటు భారతదేశాన్ని విశ్వగురువుగా నిలపాలనే లక్ష్యంతో ప్రధాని మోదీ పనిచేస్తున్నారని పేర్కొన్నారు. అవినీతి రహిత పాలన, దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నకిరేకంటి మొగులయ్య, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వనం అంజయ్య హాజరయ్యారు. జిల్లా కార్యవర్గ సభ్యులు కట్ట యాదయ్య, బీజేపీ సీనియర్ నాయకులు డోగుపర్తి సుభాష్, జెల్లా లక్ష్మీనారాయణ, మన్యం పద్మారెడ్డి, రాపోలు స్వామి, శనగొండ భూక్షమాచారి, భాస్కరచారి, సురవి హరిబాబు తదితరులు పాల్గొన్నారు.అలాగే జనరల్ సెక్రటరీ జంగిలి సత్యనారాయణ, బెజ్జంకి శివకుమార్ చారి, ఉపాధ్యక్షులు కంభంపాటి శివరంజన్, బట్టి రమేష్, కార్యదర్శులు గన్నేబోయిన మధు, బతుక నరేష్, రేపాక లింగస్వామి, నాయకులు ఏనూతుల సురేష్, మచ్చ మహేష్, బతుక సైదులు, తిరుమలేష్, పెండెం శ్రీను, ఘాట్కా శ్రీను, భువనగిరి వెంకటేష్, పోతుగాని ప్రకాష్, కైరంకొండ సంతోష్, సురివి శేఖర్, బండమీది సుధాకర్, గురుకు సైదులు, గాదె మల్లయ్య, గాద సైదులు, ఎర్రబోయిన వెంకటేష్, శివ తదితరులు పాల్గొన్నారు.