ఘనంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు…
లోకేశ్వరం శివాలయంలో ప్రత్యేక పూజలు…
లోకేశ్వరం, సెప్టెంబర్ 17 అక్షిత న్యూస్ :
దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రంలో ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేశ అత్యున్నత నేత పుట్టినరోజు సందర్భంగా మండలంలోని మండల నాయకులు శివాలయం శివనామస్మరణతో మార్మోగింది.
ప్రధాని మోడీ సంపూర్ణ ఆయురారోగ్యాలతో వర్ధిల్లి, ఆయన నేతృత్వంలో దేశం మరింత అభివృద్ధి పథంలో అగ్రగామిగా దూసుకెళ్లాలని, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ భక్తులు, నాయకులు ప్రత్యేక ప్రార్థనలు, అభిషేకాలు సమర్పించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు సాయన్న ప్రత్యేక పూజలకు నాయకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ మెండే శ్రీధర్, మాజీ ఎంపీటీసీ లక్కంపల్లి జై సాగర్ రావు, సంటెనోల్ల సంటెన్న సార్, కొందాపురం రాజశేఖర్,వెంకట్ రెడ్డి, పృథ్వీరాజ్ తదితరులు భక్తిశ్రద్ధలతో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు…