భక్తి శ్రద్ధలతో గణపతి పూజలు 

భక్తి శ్రద్ధలతో గణపతి పూజలు 

అత్యంత వైభవంగా తొలి పూజ 

మహా గణపతికి లడ్డూల సమర్పణ 

నాగోల్, అక్షిత ప్రతినిధి :

జీఎస్‌ఐ డివిజన్ పరిధిలోని సహభావన టౌన్‌షిప్ గ్రేటర్ కమ్యూనిటీ సీ-బ్లాక్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహా గణపతి తొలి పూజా కార్యక్రమం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో విగ్రహ దాత నాగేంద్ర బాబు విశేష పూజలు నిర్వహించారు. అలాగే మహా గణపతికి సమర్పించిన లడ్డూ ప్రసాద దాతలుగా 21 కేజీల లడ్డూను రిషికా రెడ్డి, 11 కేజీల లడ్డూను ఆంజనేయులు అందజేశారు.ఆర్గనైజింగ్ సెక్రటరీ రేవంత్ బాబు, చైర్మన్ విక్రమ్ రెడ్డిల పర్యవేక్షణలో జరిగిన ఈ వేడుకల్లో అసోసియేషన్ మరియు కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ జరిగింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking