టిజెడబ్ల్యూఏ జాతీయ సలహాదారుగా డా. కొండ మల్లేశం గౌడ్.

టిజెడబ్ల్యూఏ జాతీయ సలహాదారుగా డా. కొండ మల్లేశం గౌడ్.

జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం మరింత బలంగా గళం.. 

రామన్నపేట అక్షిత ప్రతినిధి 

తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ( టి జె డబ్ల్యూ ఏ) జాతీయ సలహాదారుగా స్థానికం జాతీయ తెలుగు దినపత్రిక సీఈఓ, చీఫ్ ఎడిటర్ డా. కొండ మల్లేశం గౌడ్ నియమితులయ్యారు.జర్నలిస్టుల సంక్షేమం, వృత్తిపరమైన హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం, ఐక్యత కోసం టిజెడబ్ల్యూఏ చేపడుతున్న కార్యక్రమాలకు ఆయన అనుభవం, సేవలు మరింత బలాన్నిస్తాయని సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం నాగోల్‌లోని స్థానికం జాతీయ తెలుగు దినపత్రిక కార్యాలయంలో డా. కొండ మల్లేశం గౌడ్‌ను టిజెడబ్ల్యూఏ జాతీయ జనరల్ సెక్రటరీ, సందేశం టైమ్స్ సీఈఓ షెట్టి వెంకటేష్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలసి నియామకానికి సంబంధించిన ఐడీ కార్డు, ట్యాగ్‌ను అందజేశారు.ఈ సందర్భంగా షెట్టి వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ.. జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం టిజెడబ్ల్యూఏ నిరంతరం కృషి చేస్తోందన్నారు.జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు వృత్తిపరమైన భద్రత, గౌరవం, ఐక్యత కోసం సంఘాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. జాతీయ సలహాదారుగా డా. కొండ మల్లేశం గౌడ్ అందించే సూచనలు, సహకారం సంఘానికి ఎంతో ఉపయోగపడతాయని ఆకాంక్షించారు. జర్నలిస్టుల సంక్షేమం, వృత్తి గౌరవం, హక్కుల పరిరక్షణే లక్ష్యంగా టిజెడబ్ల్యూఏ ను మరింత పటిష్టంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరి సహకారం అవసరమని ఆయన అన్నారు.డా. కొండ మల్లేశం గౌడ్‌కు టిజెడబ్ల్యూఏ జాతీయ సలహాదారు బాధ్యతలు అప్పగించడంపై పలువురు జర్నలిస్టులు, టిజెడబ్ల్యూఏ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking