నిట్‌లో సీటు సాధించిన విద్యార్థిని సాయి చైతన్యకు గ్రామస్తుల సన్మానం…
లోకేశ్వరం,సెప్టెంబర్ 10 అక్షిత న్యూస్ :
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రానికి చెందిన మెండె సాయి చైతన్య, నిట్‌లో సీటు సాధించడంతో గ్రామస్తులు ఘనంగా సన్మానించారు.మెండె వెంకట రమణ–సంధ్య దంపతుల సంతానమైన సాయి చైతన్యను గల్లీ సభ్యులు శాలువాతో సత్కరించి అభినందించారు.ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. సాయి చైతన్య ఇదే స్ఫూర్తితో ఉన్నత విద్యలో రాణించి భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు.ఈ కార్యక్రమంలో పెరంబుదూర్ నరసింహస్వామి,వాసన్ వెంకటేష్,డాక్టర్ నగేష్,సాయినాథ్,మధు తదితరులు పాల్గొన్నారు…