పోసన్‌పల్లిలో టైలరింగ్ శిక్షణ సర్టిఫికెట్ పంపిణీ కార్యక్రమం.
కొమురవెల్లి అక్షిత న్యూస్:
పోసన్‌పల్లి గ్రామంలో మహిళలకు నిర్వహించిన టైలరింగ్ శిక్షణ బ్యాచ్ ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన మహిళా శిక్షణార్థులకు ఈ సందర్భంగా సర్టిఫికెట్లను అందజేశారు.ఈ కార్యక్రమానికి యూనియన్ రసేటి సిద్దిపేట డైరెక్టర్ గేము నాయక్ ముఖ్య అతిథిగా పోసాన్ పల్లె గ్రామ సర్పంచ్ నర్సింహులు హాజరై, శిక్షణ పూర్తి చేసిన మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు. మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో ఫ్యాకల్టీ నాగరాజు, ప్రశాంత్, పంచాయతీ సెక్రెటరీ జావేద్, సీసీ కవితతో పాటు టైలరింగ్ శిక్షణార్థులు పాల్గొన్నారు. మహిళలకు ఉపాధి నైపుణ్యాలను అందించడంలో రస్ఈటీ ఐ చేపడుతున్న శిక్షణా కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని కార్యక్రమంలో పాల్గొన్న వారు తెలిపారు.