పోరాటాల స్ఫూర్తి.. చాకలి ఐలమ్మ

పోరాటాల స్ఫూర్తి.. చాకలి ఐలమ్మ 

– గడ్‌చందలో ఘనంగా విగ్రహావిష్కరణ

– ఐలమ్మ మనవరాలు శ్వేతా సంపత్ హాజరు…

లోకేశ్వరం, సెప్టెంబర్ 8 అక్షిత న్యూస్ : 

నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని గడ్‌చందలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని మంగళవారం ఘనంగా ఆవిష్కరించారు. అనంతరం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా సర్పంచ్ కరిపే శోభారాణి, శ్యాంసుందర్,మాట్లాడుతూ.. ఐలమ్మ పోరాటం అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు. ఆమె త్యాగాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అనంతరం రజక సంఘం సభ్యులు సర్పంచ్‌ను శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఐలమ్మ మనవరాలు శ్వేతా సంపత్, జిల్లా రజక సంఘ సభ్యులు సుంకేట పోశెట్టి,బామ్ని. కె సర్పంచ్ షాపురం రాణి రాజు,ఉప సర్పంచులు బంతి నరేష్, రవికుమార్, వి.డి.సి. సభ్యులు, రజక సంఘ సభ్యులు,గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు…

Leave A Reply

Your email address will not be published.

Breaking