ఫ్యూచర్ సిటీ పోలీస్ అసోసియేషన్ సెక్రటరీగా మద్ది మహేందర్ రెడ్డి
– ఇబ్రహీంపట్నం సీఐకి కీలక బాధ్యతలు..
– పోలీస్ అధికారుల సంక్షేమానికి కృషి చేస్తానని వెల్లడి
రంగా రెడ్డి అక్షిత బ్యూరో :
రంగారెడ్డి జిల్లా, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సివిల్ ఫోర్స్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్‌కు జరిగిన ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మద్ది మహేందర్ రెడ్డి సెక్రటరీగా ఎన్నికయ్యారు. పోలీస్ అధికారుల సంక్షేమం, సమస్యల పరిష్కారం, విధి నిర్వహణలో ఎదురయ్యే ఇబ్బందులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో అసోసియేషన్ కీలక పాత్ర పోషించనుంది.సెక్రటరీగా ఎన్నికైన మద్ది మహేందర్ రెడ్డికి పోలీస్ అధికారులు, సిబ్బంది, సహచరులు అభినందనలు తెలిపారు. బాధ్యతాయుతమైన పదవికి ఎన్నిక కావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో తనకున్న అనుభవాన్ని ఉపయోగిస్తూ పోలీస్ అధికారుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మద్ది మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి సెక్రటరీగా ఎన్నుకున్న పోలీస్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. అసోసియేషన్ సెక్రటరీగా తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పారు. పోలీస్ అధికారుల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తూ, వారి సమస్యలను సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.పోలీస్ అధికారులు ఎదుర్కొంటున్న వృత్తిపరమైన సమస్యలు, విధి నిర్వహణలో ఎదురయ్యే ఇబ్బందులు, సంక్షేమానికి సంబంధించిన అంశాలపై అసోసియేషన్ తరఫున సమన్వయంతో ముందుకు సాగుతామని తెలిపారు. పోలీస్ శాఖలో అధికారులు, సిబ్బంది మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు, ప్రజలకు మరింత మెరుగైన పోలీసింగ్ అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం సీఐగా విధులు నిర్వహిస్తూ మరో కీలక బాధ్యతను చేపట్టిన మద్ది మహేందర్ రెడ్డి ఎన్నిక పట్ల స్థానికంగా కూడా పలువురు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ అధికారుల సంక్షేమంతో పాటు ప్రజా భద్రతకు ప్రాధాన్యతనిస్తూ తన బాధ్యతలను ముందుకు తీసుకెళ్లాలని పలువురు ఆకాంక్షించారు. అధికారుల అభినందనలు సివిల్ ఫోర్స్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ సెక్రటరీగా ఎన్నికైన మద్ది మహేందర్ రెడ్డికి పోలీస్ అధికారులు, సిబ్బంది, స్నేహితులు, శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త బాధ్యతల్లో ఆయన విజయవంతంగా రాణించాలని ఆకాంక్షించారు.