కోటి పందేల డెన్ పై పోలీసుల మెరుపు దాడి

కోటి పందేల డెన్ పై పోలీసుల మెరుపు దాడి

రంగారెడ్డి అక్షిత బ్యూరో:

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని మన్నెగూడ లో కోడిపందేల నిర్వహణపై ఆదిభట్ల పోలీసులు కొరడా ఝళిపించారు. పౌల్ట్రీ ఫామ్ పై మెరుపు దాడి చేసి 22 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆదిభట్ల సీఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్నెగూడ లో గల పౌల్ట్రీ ఫామ్ లో కోడిపందాలు నిర్వహిస్తున్నట్లు సమాచారంతో శనివారం రాత్రి దాడి చేసినట్టు తెలిపారు. దాడిలో 22 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. దాడిలో 31 కోళ్లు, రూ.3,60, 510 నగదు,19 స్మార్ట్ ఫోన్లు,146 కోడి పందేల కత్తులు, 17 సెట్ల ప్లేయింగ్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking