కాంగ్రెస్ వైఫల్యాలపై నేడు బీఆర్‌ఎస్ వినతిపత్రం

కాంగ్రెస్ వైఫల్యాలపై నేడు బీఆర్‌ఎస్ వినతిపత్రం

లోకేశ్వరం ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణికి తరలిరావాలని పిలుపు…

మండల కన్వీనర్ కరేపే శ్యాంసుందర్

లోకేశ్వరం,సెప్టెంబర్ 6అక్షిత న్యూస్ :

నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తోందని బీఆర్‌ఎస్ మండల కన్వీనర్ కరేపే శ్యాంసుందర్ విమర్శించారు. బీఆర్‌ఎస్ అధిష్ఠానం పిలుపు మేరకు సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) కార్యాలయంలో పార్టీ తరఫున వినతిపత్రం సమర్పించనున్నట్లు ఆయన ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా శ్యాంసుందర్ మాట్లాడుతూ… ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకే ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నామని స్పష్టం చేశారు. మండలంలోని బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, అనుబంధ సంఘాల బాధ్యులు, కార్యకర్తలు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఎంపీడీవో కార్యాలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు…

Leave A Reply

Your email address will not be published.

Breaking