విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం వద్దు
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి
బీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో రామన్నపేటలో భారీ నిరసన ర్యాలీ
రామన్నపేట అక్షిత ప్రతినిధి
విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడకుండా, విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో రామన్నపేట పట్టణంలోని సుభాష్ సెంటర్ వద్ద భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌వీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయకుండా కాలయాపన చేస్తూ విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు.ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు సకాలంలో అందకపోవడంతో పేద, మధ్యతరగతి విద్యార్థులు తమ చదువులను కొనసాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.యూత్ డిక్లరేషన్ పేరుతో యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, జాబ్ క్యాలెండర్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని కోరారు.అలాగే స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయడంతో పాటు జీవో నంబర్ 97ను రద్దు చేయాలని, విద్యార్థులు, నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఇకనైనా స్పందించి ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని బీఆర్‌ఎస్‌వీ నాయకులు కోరారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌వీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.