అంబట్ పల్లిలో వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి ఉరిగింపు మరియు యాదవుల ఉట్టి ఉత్సవం
ఉట్టి కొట్టిన విజేతలకు బహుమతులు అందజేసిన అచ్చుతా రెడ్డి
నాగర్ కర్నూల్ అక్షిత ప్రతినిధి
శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని లింగాల మండల పరిధిలోని అంబట్ పల్లి గ్రామంలో స్థానిక యాదవుల ఆధ్వర్యంలో ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా, ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. ఈ వేడుకలకు గ్రామ పెద్దలు యాదవ సోదరులు మరియు ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామ యువకులు , ఉట్టిని కొట్టేందుకు ఉత్సాహంగా పోటీ పడ్డారు. అంబట్ పల్లి గ్రామస్తుల కేరింతలు, కోలాటాల మధ్య ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోటీలో యువత ఎంతో నైపుణ్యంతో ఉట్టిని పగలగొట్టారు.అనంతరం, ఉట్టిని విజయవంతంగా కొట్టిన విజేతలకు అచ్చుతా రెడ్డి 3016 రూపాయలు స్వయంగా బహుమతులను అందజేసి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవడంలో యాదవుల పాత్ర అభినందనీయమన్నారు. ఇటువంటి పండుగలు గ్రామాల్లో ఐక్యతను, సోదరభావాన్ని మరింత పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక యాదవ సంఘం అధ్యక్షులు తొళ్ల స్వామియాదవ నాయకులు, గ్రామ పెద్దలు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నారాయణ గౌడ్ సాయి రెడ్డి , మాజీ ఉపసర్పంచ్ జనార్ధన్, యువకులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.