ఫ్రంట్‌లైన్ పాఠశాలలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

ఫ్రంట్‌లైన్ పాఠశాలలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

ఆకట్టుకున్న చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు

తాండూరు అక్షిత ప్రతినిధి:

తాండూరు పట్టణంలోని ఫ్రంట్‌లైన్ పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో పాల్గొని సందడి చేశారు. చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.విద్యార్థుల ప్రదర్శనలతో పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణాన్ని సంతరించు కుంది. చిన్నారుల ప్రతిభను చూసి తల్లిదండ్రులు, ఉపా ధ్యాయులు అభి నందించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ.. విద్యతో పాటు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల ప్రాధాన్యతను విద్యార్థులకు తెలియ జేసేలా పాఠశాలలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభి నందనీయ మన్నారు. చిన్నారుల్లో సాంస్కృతిక విలువలు, సంప్రదాయాలపై అవగాహన పెంపొందించేందుకు ఈ కార్యక్రమాలు దోహద పడతాయని తెలిపారు.కృష్ణాష్టమి వేడుకలను విజయవంతంగా నిర్వహించిన పాఠశాల యాజమాన్యం, ఉపా ధ్యాయులకు తల్లిదండ్రులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్య సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking